ఎవరికైనా అవగాహన సదస్సులు గదిలో ఏర్పాటు చేసి మంచి మాటలు చెబుతారు. కానీ నిజామాబాద్ జిల్లా డిపో-1 ఆర్టీసీ అధికారులు కొత్త ఆలోచన చేశారు. నాలుగు గోడల మధ్య బంధించినట్లు ఉండకుండా బస్సునే అవగాహన సదస్సుల అడ్డాగా మార్చేశారు. బస్సులో ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి, బస్సు చుట్టూ ఆరోగ్య సూత్రాలు వివరించే చిత్రాలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి ఆరోగ్యం- ఆహారం అంశాలపై బస్సులోనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి రోజు 30 మంది ఈ అవగాహన సదస్సులో పాల్గొంటారు.
అవగాహన సదస్సుకు వారి డిపో బస్సే అడ్డా
నిజామాబాద్ జిల్లా డిపో-1 ఆర్టీసీ అధికారులు వినూత్న రీతిలో ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అవగాహన సదస్సుకు వారి డిపో బస్సే అడ్డా