నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు నూతన భూ క్రమబద్ధీకరణ పథకంపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త జీవో ద్వారా ఎల్ఆర్ఎస్ ఛార్జీలు పెంచడమంటే.. సామాన్య ప్రజలను దోచుకోవడమేనని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సర్ధార్ అలీ అన్నారు.
'నూతన భూ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం పునరాలోచించాలి' - Nizamabad real estate traders protest
నూతన భూ క్రమబద్ధీకరణ పథకంపై ప్రభుత్వం పునరాలోచించాలని నిజామాబాద్ జిల్లా రియల్ వ్యాపారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అట్టహాసంగా తీసుకొచ్చిన 131 జీవోను ఉపసంహరించుకోవాలని కోరారు.
!['నూతన భూ క్రమబద్ధీకరణపై ప్రభుత్వం పునరాలోచించాలి' Nizamabad real estate traders protest against LRS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8751389-942-8751389-1599734935577.jpg)
ఎల్ఆర్ఎస్పై నిజామాబాద్ రియల్ వ్యాపారుల ఆందోళన
కరోనా కాలంలో ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు యథావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. 200 గజాలలోపు ఉన్న ప్లాట్లకు ఒక రూపాయికి ఎల్ఆర్ఎస్ ఇవ్వాలని కోరారు.
స్థానిక సంస్థల ఆమోదం పొందిన లేఅవుట్లలోని ప్లాట్లు అక్రమమని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేయాలని లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.