పల్లె, పట్టణ ప్రగతి అమలులో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధిక వర్షాలు, ఎరువులు, పల్లె ప్రగతి, రైతు వేదికలపై వివిధ శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు. విలేజ్ పార్కుల నిర్మాణం అద్భుతంగా జరుగుతోందని మంత్రి తెలిపారు. నగరంలో పబ్లిక్ టాయిలెట్స్, ఓపెన్ జిమ్, ప్లాంటేషన్ నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
'పల్లె, పట్టణ ప్రగతి అమలులో రెండో స్థానంలో నిజామాబాద్'
నిజామాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధిక వర్షాలు, ఎరువులు, పల్లె ప్రగతి, రైతు వేదికలపై వివిధ శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించారు.
'పల్లె, పట్టణ ప్రగతి అమలులో రెండో స్థానంలో నిజామాబాద్'
ప్రజలు కొవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అన్ని పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామని వివరించారు. ఈ సమీక్షలో కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
TAGGED:
Nizamabad news