నిజామాబాద్ జిల్లాలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 10 తర్వాత ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చినట్లు తేలితే వాహనాలను సీజ్ చేసి వారిని వెనక్కి పంపిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ బైపాస్, పోలీస్ కమిషనరేట్, పులాంగ్, నెహ్రూ చౌక్, వర్ని చౌరస్తా తదితర ప్రాంతాల్లో ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సరైన కారణం లేకపోతే వాహనాలు స్వాధీనం.. - బయట తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేస్తున్న పోలీసులు
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. పట్టణంలోని రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కారణం లేకుండా బయటకు వచ్చిన వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు.
సరైన కారణం లేకపోతే వాహనాలు స్వాధీనం..
సీజ్ చేసిన వాహనాలను పరేడ్ గ్రౌండ్స్‌కు తరలించారు. ఈ వాహనాల కోసం వాహనదారులు చలానాలు చెల్లించి తీసుకునేందుకు వస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని.. ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు