తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో డ్రోన్ కెమెరాతో పటిష్ఠ నిఘా​ - లాక్​ డౌన్ పరిశీలనకు డ్రోన్ కెమెరాలు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్​ డౌన్ పరిశీలనకు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నారు. వాహనదారులు అకారణంగా రోడ్డెక్కితే వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

'డ్రోన్ కెమెరాలున్నాయి... జాగ్రత్త !!'
'డ్రోన్ కెమెరాలున్నాయి... జాగ్రత్త !!'

By

Published : Apr 16, 2020, 5:41 PM IST

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కరోనా కట్టడికి మరింత పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో గోల్డెన్ జూబ్లీ , ఖిల్లా రోడ్ , ఆటో నగర్ 14వ డివిజన్ అక్బర్ బాగ్ , ఎల్లమ్మ గుట్టను ఏసీపీ శ్రీనివాస్ కుమార్ పరిశీలించారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించి వాహనదారులు ఏ విధంగా భౌతిక దూరం పాటిస్తున్నారో గమనిస్తున్నారు . నిజామాబాద్ సీపీ కార్తికేయ ఆదేశానుసారం డ్రోన్ వినియోగిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.

డ్రోన్ కనిపెడుతుంది.. పట్టుబడితే సీజ్

డ్రోన్ కెమెరాల ద్వారా లైవ్ మానిటరింగ్ చేసి అకారణంగా రోడ్డెక్కితే అదుపులోకి తీసుకుంటున్నామన్నారు. అవసరం లేకపోయినా రోడ్డు మీద ఉంటున్న వారిపై కేసులు నమోదు చేస్తామని ఏసీపీ హెచ్చరించారు. రోడ్లపై ద్విచక్ర వాహనాలతో తిరిగే వ్యక్తులను డ్రోన్ కెమెరాతో నిఘా పెడుతున్నట్లు వివరించారు. సరైన కారణం లేకుండా పట్టుబడితే వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. పోలీసుల సూచనలు, సలహాలు పాటిస్తూ లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా ఆచరించాలన్నారు.

'డ్రోన్ కెమెరాలున్నాయి... జాగ్రత్త !!'

ఇవీ చూడండి : లాక్​ డౌన్​ ముగిశాక కొత్త రూల్స్​ ఇవే...

ABOUT THE AUTHOR

...view details