నిర్మల్ నుంచి నిజామాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న 60 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
అక్రమ బియ్యం రవాణాను అడ్డుకున్న పోలీసులు.. ఇద్దరిపై కేసు - police caught ration rice at Manchiryala cowrastha
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద... అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టణ పోలీసులు పట్టుకున్నారు. నిర్మల్ నుంచి నిజామాబాద్ కు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించినట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
అక్రమ బియ్యం రవాణాను అడ్డుకున్న పోలీసులు.. ఇద్దరిపై కేసు
నిజామాబాద్ కు చెందిన షేక్ అఫ్రోజ్, నిర్మల్ కు చెందిన సయ్యద్ హమీద్ లు కలిసి ఐచర్ వాహనం (ఏపీ 10వి 1672) లో అక్రమంగా బియ్యం తరలిస్తున్నరన్నా సమాచారం మేరకు… నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్టు వెెెెెెెల్లడించారు.
Last Updated : Sep 13, 2020, 1:51 AM IST
TAGGED:
Nizamabad police caught