ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన నితిన్(22) అనారోగ్యంతో అక్కడే మృతి చెందాడు. నితిన్ నాలుగు నెలల కింద సౌదీ వెళ్లాడు. నెల రోజుల పాటు పని సజావుగా సాగింది. ఇంతలోనే అక్కడ లాక్డౌన్ విధించడం వల్ల ఉపాధి కోల్పోయాడు.
సౌదీలో నిజామాబాద్ యువకుని మృతి - సౌదీ నిజామాబాద్ వ్యక్తి మృతి
ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడు అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సౌదీలో నిజామాబాద్ యువకుని మృతి
కొన్ని రోజులుగా తిండి, నిద్ర లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రిలో రెండు రోజుల చికిత్స పొందిన అనంతరం మృత్యువాత పడ్డాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు. నితిన్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.