ఆరోవిడత హరితహారంలో భాగంగా నిజామాబాద్ నగరంలోని 11వ డివిజన్లో మేయర్ దండు నీతూ కిరణ్ మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతను ప్రజలు తీసుకోవాలని సూచించారు. కాలనీ పరిధిలో ఖాళీ స్థలాల్లో వర్షపునీరు నిలువ ఉన్నట్లయితే మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందిచాలని కోరారు.
కాలనీల్లో వర్షపు నీళ్లు నిలువకుండా చూసుకోవాలి: మేయర్ - 6 term Harithaharam programme in nizamabad
వర్షకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో నీటి నిల్వలను ఉండకుండా చూసుకోవాలని నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
కాలనీల్లో వర్షపు నిలువకుండా చూసుకోవాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ నీటి నిల్వలను తమ ఇంటి ఆవరణలో ఉండకుండా చూసుకోవాలని కాలనీవాసులకు సూచించారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.