నిజామాబాద్ నగరపాలక సంస్థ 2020-2021 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశాన్ని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అధ్యక్షతన నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో నిర్వహించారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 341.99 కోట్ల బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించినట్లు మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. నగర అభివృద్ధికి 32 అంశాలతో అజెండాను రూపొందించినట్లు వెల్లడించారు.
నిజామాబాద్ నగరపాలర సంస్థ బడ్జెట్ రూ. 341.99కోట్లు - నిజామాబాద్ జిల్లా వార్తలు
నిజామాబాద్ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాన్ని నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో నిర్వహించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 341.99 కోట్ల బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించినట్లు మేయర్ నీతూ కిరణ్ తెలిపారు.
![నిజామాబాద్ నగరపాలర సంస్థ బడ్జెట్ రూ. 341.99కోట్లు nizamabad muncipal corporation budget meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7656621-43-7656621-1592399814347.jpg)
నిజామాబాద్ నగరపాలర సంస్థ బడ్జెట్ 341.99కోట్లు
ఈ అజెండాను కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టగా.. విస్తృతంగా చర్చించిన అనంతరం ఆమోదం పొందినట్లు మేయర్ పేర్కొన్నారు. ప్రతి రూపాయిని నగరాభివృద్ధికి సద్వినియోగం చేస్తామని నీతూ కిరణ్ అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ జితేష్.వి.పాటిల్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: షేక్‌పేట్ తహశీల్దార్ సుజాతకు బెయిల్ మంజూరు