ప్రధాని మోదీ గాంధీ కలలు కన్న స్వరాజ్యానికి కృషి చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి పేర్కొన్నారు. నిజామాబాద్లో గాంధీ చౌక్ వద్ద మహాత్ముడికి నివాళి అర్పించి సంకల్ప యాత్రను ప్రారంభించారు. 70 సంవత్సరాలుగా పాలించిన పార్టీలన్నీ గాంధీ ఆశయాలను పెడచెవిన పెట్టి పరిపాలన చేశాయని విమర్శించారు.
'గాంధీ కలలు కన్న స్వరాజ్యం... మోదీతోనే సాధ్యం' - ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ పర్యటన
మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా దేశంలో భాజపా పరిపాలన కొనసాగుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అన్నారు.

నిజామాబాద్లో గాంధీ సంకల్ప యాత్ర
నిజామాబాద్లో గాంధీ సంకల్ప యాత్ర
మహాత్ముడి ఆశయాలకనుగుణంగా భాజపా పరిపాలన చేస్తోందని కొనియాడారు. జిల్లాలో గతం కన్నా రెట్టింపు ధాన్యం దిగుబడి వచ్చిందని కానీ కొనుగోలుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని మండిపడ్డారు. మార్కెట్ యార్డులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
- ఇదీ చూడండి : పెళ్లి మండపంలో ముష్టియుద్ధం