పౌరసత్వ సవరణ చట్టం వల్ల నిజమైన ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. కేవలం ఓట్ల కోసమే ఎంపీ అసదుద్దీన్ నిజామాబాద్లో సభ ఏర్పాటు చేశారని ఆరోపించారు. రాష్ట్ర పాలన అసదుద్దీన్ ఓవైసీ చేతిలోకి వెళ్ళిపోయిందని విమర్శించారు.
'రాష్ట్రపాలన అసదుద్దీన్ చేతిలోకి వెళ్లిపోయింది'
మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకే ఎన్ఆర్సీ పేరుతో నిజామాబాద్లో ఎంపీ అసదుద్దీన్ సభ ఏర్పాటు చేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.
'రాష్ట్రపాలన అసదుద్దీన్ చేతిలోకి వెళ్లిపోయింది'
బంగ్లా, పాక్ లో హిందువుల సంఖ్య తగ్గిపోతోందని.. బలవంతంగా మతం మార్చుతున్నారని.. లేదంటే దాడులు చేసి చంపేస్తున్నారని అర్వింద్ అన్నారు. వారికి మన దేశ పౌరసత్వం ఇవ్వాలని భావిస్తే అనవసర ఆందోళన చేస్తున్నారని అన్నారు.
మత ప్రాతిపదికన జరిగిన సమావేశానికి అనుమతిచ్చిన పోలీసులు.. మున్సిపల్ వార్డుల పరిశీలనకు వెళ్తానంటే అనుమతి ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు.