మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 8 నెలలుగా పెండింగ్‌లో ఉంచారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. నిజామాబాద్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద ధర్నా చేపట్టారు.
Mp Arvind: 'మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఉద్యమిస్తాం' - మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి తాజా వార్తలు
తెరాస నాయకులకు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటే మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులపై దృష్టి సారించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) అన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన ఫైల్‌ను మంత్రి ప్రశాంత్ రెడ్డి 8 నెలలుగా పెండింగ్‌లో పెట్టారని ఆరోపిస్తూ.. నిజామాబాద్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద ధర్నా చేపట్టారు.
మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి
తెరాస నాయకులకు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటే మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులపై దృష్టి సారించాలని ఎంపీ అర్వింద్ అన్నారు. పసుపుకు మద్దతు ధర రావాలంటే స్థానికంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా భాజపా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నారాయణ, జిల్లా నాయకులు దంపల్ సూర్యనారాయణ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:CM KCR : కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం
Last Updated : Jun 28, 2021, 4:21 PM IST