MP Arvind comments: ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణలో ధాన్యం సేకరణను 95 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామని చెప్పారు. బాయిల్డ్ రైస్ ఇవ్వమని చెప్పిన రాష్ట్రమే మళ్లీ.. దిల్లీలో ఆందోళన చేయడం అర్ధరహితమన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నులకు అదనంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకునేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. రా రైస్ ఎంత ఇస్తే అంత తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.
చక్కెర పరిశ్రమలను వెంటనే తెరిపించాలి..
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని భాజపా ఎంపీ అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ నేత డి.శ్రీనివాస్ భాజపాలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని చెప్పారు. మూతపడిన చక్కెర పరిశ్రమలను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు. లేదంటే సంక్రాంతి తర్వాత ఉద్యమం లేవదీస్తామన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డికి వరి పంట, ధాన్యంపై అవగాహన లేదని అర్వింద్ విమర్శించారు. మంత్రి సొంత జిల్లాలో ఆయన అనుచరులే పొద్దు తిరుగుడు విత్తనాలు బ్లాక్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యే ఓడిపోవడం ఖాయం..