తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలి: ఎంపీ అర్వింద్

ముఖ్యమంత్రి కేసీఆర్​ వైఖరిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​కు లేఖ రాసినట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కేసీఆర్ కుటుంబంపై అసమ్మతి కారణంగానే ముఖ్యమంత్రి పదవి గురించి చర్చ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.

'సీఎంగా కేసీఆరే ఉండాలి... ఆయనను గద్దె దించే బాధ్యత మాది'
'సీఎంగా కేసీఆరే ఉండాలి... ఆయనను గద్దె దించే బాధ్యత మాది'

By

Published : Feb 8, 2021, 5:41 PM IST

Updated : Feb 8, 2021, 7:19 PM IST

గులాబీ డ్రామాకు ఆదివారం తెరపడిందని ఎద్దేవా చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కేసీఆర్ కుటుంబంపై అసమ్మతి కారణంగానే సీఎం పదవి చర్చకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్... ఏ హక్కుతో ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. ఎవరు సీఎంగా ఉండాలో ఎన్నుకునే అధికారం ఎమ్మెల్యేలకు ఉందని... అది రాజ్యాంగం ఇచ్చిన హక్కని స్పష్టం చేశారు.

సీఎంగా కేసీఆర్​ను తొలగించాలని గవర్నర్ తమిళిసైకి లేఖ రాశా. 2023 వరకు కేసీఆర్​యే ముఖ్యమంత్రిగా ఉండాలి. కేసీఆర్​ను గద్దె దించి భాజపా అభ్యర్థి పీఠం ఎక్కుతారు. కేసీఆర్ గద్దెదిగితే ఆ పదవికి ఈటల రాజేందర్ ఒక్కరే అర్హులు.

--- ధర్మపురి అర్వింద్, ఎంపీ

అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నారని సీఎం కేసీఆర్ అభద్రతా భావంలో ఉన్నారని అర్వింద్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడిస్తేనే ఎమ్మెల్యేలు మాట్లాడారని ఎంపీ అన్నారు. ఏదైనా అనాలంటే కేటీఆర్​ను అనాలని కానీ... ఎమ్మెల్యేలను ఎలా అంటారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:కేటీఆర్ సొంత నిధులతో గంభీరావుపేట రైతు వేదిక నిర్మాణం

Last Updated : Feb 8, 2021, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details