తెలంగాణ

telangana

ETV Bharat / state

'మరో 100 బాండ్​పేపర్​లైనా రాసిస్తా... వాటిని సాధించి తీరుతా' - ఎంపీ అర్వింద్​కు అభినందన సభ

మరో 100 బాండ్​ పేపర్​లైనా రాసి... వాటిని నెరవేర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ఎంపీ అర్వింద్​ పేర్కొన్నారు. నిజామాబాద్​లో రైతులు ఏర్పాటు చేసిన అభినందన సభలో... రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. పసుపుబోర్డు తీసుకొస్తానని చెప్పి.... సుగంధద్రవ్యాలు తీసుకొచ్చానని వివరించారు.

NIZAMABAD MP ARVINDH ON SPICES BOARD
NIZAMABAD MP ARVINDH ON SPICES BOARD

By

Published : Feb 17, 2020, 8:04 PM IST

నిజామాబాద్​కు పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఏకంగా... సుగంధద్రవ్యాల బోర్డు తీసుకొచ్చానని ఎంపీ అర్వింద్ తెలిపారు. నగరంలోని బస్వగార్డెన్​లో ఎంపీ అర్వింద్​కు రైతులు అభినందన సభ నిర్వహించారు. జగిత్యాల, నిజామాబాద్ పసుపు రైతు సంఘాలు ఘనంగా సన్మానించాయి. సుగంధ ద్రవ్యాల బోర్డు ద్వారా కేవలం పసుపు రైతులే కాక మిర్చి, ఇతర పంటలు పండించే వారికి లబ్ధి చేకూరుతుందని ఎంపీ పేర్కొన్నారు.

మరో 100 బాండ్ పేపర్​లైనా రాసి... వాటిని సాధించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంపీ స్పష్టం చేశారు. తెరాస ప్రభుత్వాన్ని ఎంఐఎం నడిపిస్తోందని ఆరోపించారు. నిజామాబాద్​లోని ముస్లిం మైనారిటీ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని మండిపడ్డారు. ఎన్ఆర్సీపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ క్యాబినెట్ తీర్మాణం చేయడం దారుణమని అర్వింద్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'మరో 100 బాండ్​పేపర్​లైనా రాసిస్తా... వాటిని సాధించి తీరుతా'

ఇవీ చూడండి:ట్విట్టర్​ ట్రెండింగ్​లో హ్యాపీ బర్త్​డే కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details