తెలంగాణ

telangana

ETV Bharat / state

'మైనార్టీల సంక్షేమ పథకాలకు కేంద్రం 75శాతం నిధులిస్తోంది' - నిజామాబాద్​ జిల్లా తాజా వార్తలు

మైనార్టీల సంక్షేమ పథకాలకు కేంద్రప్రభుత్వం 75శాతం నిధులు సమకూరుస్తోందని... నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలలో కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని ఎక్కడా లేదని తెలిపారు. జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

nizamabad mp arvind said Center government 75 percent funded for minorities welfare schemes
మైనార్టీల సంక్షేమ పథకాలకు కేంద్రం 75శాతం నిధులిస్తోంది

By

Published : Jan 19, 2021, 5:04 PM IST

Updated : Jan 19, 2021, 7:15 PM IST

మైనార్టీల సంక్షేమ కోసం కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్రప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లిస్తోందని... నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా కలెక్టరేట్​లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నిధులతో అమలవుతోన్న కార్యక్రమాలపై కలెక్టర్ నారాయణరెడ్డి, ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు.

నిధుల్లో కోతపెడుతోంది...

మైనార్టీల కోసం ప్రవేశపెట్టిన ఏ పథకానికైనా కేంద్రం 75శాతం నిధులు సమకూరుస్తోందని అర్వింద్ తెలిపారు. వాటిలో రాష్ట్రప్రభుత్వం ఇవ్వాల్సిన 25శాతం నిధుల్లో కోత పెడుతోందని... దీని వల్ల అనేక పనులు పెండింగ్​లో ఉన్నాయని విమర్శించారు. వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి...

నూతన వ్యవసాయ చట్టాలలో కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని ఎక్కడా లేదని అర్వింద్ చెప్పారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని దిశ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించినట్లు ఎంపీ తెలిపారు.

ఇదీ చదవండి: వ్యాక్సిన్ ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది.. బయట లేదు : డీహెచ్

Last Updated : Jan 19, 2021, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details