'కేసీఆర్ నిరంకుశత్వానికి ఇదే నిదర్శనం' - nizamabad mp arvind
ఎంఐఎం కనుసన్నల్లోనే తెలంగాణ పాలన కొనసాగుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.
'కేసీఆర్ నిరంకుశత్వానికి ఇదే నిదర్శనం'
తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించకపోవడం కేసీఆర్ నియంత పరిపాలన సాగిస్తున్నారనడానికి నిదర్శనమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. రాష్ట్ర పాలన ఎంఐఎం కనుసన్నల్లోనే సాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో ఇంఛార్జీలు తప్ప మిగిలిన స్థానాల్లో రెగ్యులర్ ఉద్యోగులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : మోదీపై అభిమానం- నిలువెత్తు బహుమానం
TAGGED:
nizamabad mp arvind