తెలంగాణ

telangana

ETV Bharat / state

'పసుపు ఎగుమతులు పెంచుతున్నాం.. ధర పెరుగుతుంది' - నిజామాబాద్​ జిల్లా లెటేస్ట్​ వార్తలు

నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ కాంగ్రెస్​, తెరాస నేతలపై దిల్లీలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్​ ఆర్మూర్​ సభ తనను తిట్టడానికే పెట్టినట్లు ఉందన్నారు. త్వరలో పసుపు ధర పెరుగుతుందని చెప్పారు.

nizamabad mp arvind fire on congress and trs in delhi
తిట్టడానికేనా ఆర్మూర్​ సభ: ఎంపీ అర్వింద్​

By

Published : Feb 5, 2021, 2:12 PM IST

తనను తిట్టడానికే హస్తం నేతలు ఆర్మూర్​ సభ పెట్టారని ధర్మపురి అర్వింద్ విమర్శించారు. దశాబ్దాలుగా పసుపు రైతులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. త్వరలో పసుపు ధర పెరుగుతుందని చెప్పారు. ఎగుమతులు పెంచుతున్నామన్నారు. పసుపు ఎగుమతి హబ్​గా నిజామాబాద్​ తీర్చిదిద్దిటంతో రైతులు లాభం పొందుతున్నారని తెలిపారు.

కేరళలోని స్పైస్​ బోర్డు పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్​ నాయకులు దిగుమతి వ్యాపారుల వద్ద డబ్బు రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు పసుపు రైతులకు ఏం చేయాలేదని అన్నారు.

తిట్టడానికేనా ఆర్మూర్​ సభ: ఎంపీ అర్వింద్​

ఇదీ చదవండి:నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details