తెలంగాణ

telangana

ETV Bharat / state

'భాజపాకు అనుకూలంగా ఉన్నాడనే సిద్ధార్థ హత్య' - nizamabad mp arvind

నిజామాబాద్ జిల్లాలో గంజాయి సరఫరా విచ్చలవిడిగా జరుగుతోందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. గంజాయి వల్ల యువత పెడదారిన పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

mp arvind, nizamabad mp arvind, siddhartha murder
ఎంపీ అర్వింద్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, సిద్ధార్థ హత్య

By

Published : May 25, 2021, 2:23 PM IST

నిజామాబాద్ జిల్లా కమ్మర్​పల్లి మండలం హాసకొత్తూరు గ్రామంలో హత్యకు గురైన సిద్దార్థ కుటుంబాన్ని ఎంపీ అర్వింద్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.లక్ష చెక్కును అందజేశారు. ఇది కేవలం రాజకీయ హత్యేనని ఎంపీ ఆరోపించారు. భాజపాకు అనుకూలంగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతోనే సిద్ధార్థను హత్య చేశారని అన్నారు.

నిందితులను కాపాడేందుకు తెరాస నేతలు ప్రయత్నిస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. జిల్లాలో గంజాయి సరఫరా విచ్చలవిడిగా జరుగుతోందని తెలిపారు. గంజాయి వల్ల యువత పెడదారిన పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details