వైఎస్ షర్మిలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి స్వాగతం పలుకుతూనే... వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె అయినంత మాత్రాన రాజశేఖర్‌రెడ్డి కాలేరని గుర్తుంచుకోవాలని చురకలంటించారు. తెలంగాణలో కావాల్సింది రాజన్న రాజ్యం కాదని... రామరాజ్యం కావాలని అన్నారు.
రాజన్న రాజ్యానికి... రామరాజ్యానికి ఉన్న తేడా ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. రామరాజ్యం అంటే అవినీతి లేని రాజ్యమని... రైతులందరికీ మంచి ధర కల్పించడమన్నారు. ఏదైనా ఒక విషయంపై మాట్లాడే ముందు పూర్తి అవగాహనతో మాట్లాడాని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ పసుపు రైతులకు ఇస్తున్న ధర కంటే... నిజామాబాద్‌లో అధిక ధర ఇస్తున్నామని చెప్పారు.