రాష్ట్రంలో కొవిడ్ రెండో దశ ఉద్ధృతి తగ్గక ముందే... సీఎం కేసీఆర్ లాక్డౌన్ ఎత్తేశారని... నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈటల రాజేందర్ భయం పట్టుకుందన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికను దృష్టిలో ఉంచుకునే... దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే లాక్డౌన్ ఎత్తేసి... జిల్లాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు.
'కేసీఆర్కు ఈటల భయం పట్టుకుంది'
ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్కు హుజూరాబాద్ ఉపఎన్నిక భయం పట్టుకుందని... నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. అందుకే దేశంలో అందరి సీఎంల కంటే ముందుగానే లాక్డౌన్ ఎత్తేసి... జిల్లాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడం పూర్తయి... ఇప్పుడు వాసాలమర్రిని బంగారు గ్రామంగా మార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు హుజూరాబాద్ ఉపఎన్నిక భయం పట్టుకుందన్న ఎంపీ అర్వింద్
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడం పూర్తయిందని... అందుకే ఇప్పుడు వాసాలమర్రిని బంగారు గ్రామంగా మార్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి... ప్రైవేటు విమానాల్లో మంత్రి కేటీఆర్ దేశాలు తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే భూముల అమ్మకాలపై సమగ్ర విచారణ చేపడుతామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Maoist Hari Bhushan: మావోయిస్టు నేత హరిభూషణ్ మృతి: ఎస్పీ సునీల్ దత్