నిజామాబాద్ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. భూపతిరెడ్డి అనర్హతా వేటుతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ - nizamabad mlc bye elections
నిజామాబాద్ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఉపఎన్నిక కోసం ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఏప్రిల్ 7న ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ తొమ్మిదిన ఓట్ల లెక్కింపు చేపడతారు.
స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల
ఉపఎన్నిక కోసం ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి ఈ నెల 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20 న నామినేషన్లు పరిశీలన చేపడతారు. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది.
ఏప్రిల్ ఏడో తేదీన ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ తొమ్మిదిన ఓట్ల లెక్కింపు చేపడతారు.