తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో మేయర్​ పర్యటన - నిజామాబాద్​ న్యూస్​

నిజామాబాద్​ నగరంలో మేయర్ నీతూ కిరణ్ వరుస పర్యటనలు చేస్తున్నారు. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. మురుగు కాల్వలు, చెత్త సేకరణ ఎప్పటికప్పుడు జరపాలని పురపాలక సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Nizamabad Mayor Tour In Town
నిజామాబాద్​లో మేయర్​ పర్యటన

By

Published : May 29, 2020, 7:33 PM IST

నిజామాబాద్​ మేయర్​ దండు నీతూ కిరణ్​ నగరంలో డివిజన్ల వారిగా పర్యటిస్తూ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. 7వ డివిజన్​ పరిధిలో గల రోటరీ నగర్​లో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీరునిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, పరిసరాల్లో చెత్త ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు.

వర్షపు నీటిని మళ్లించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా, సీజనల్​ వ్యాధులు వ్యాపించకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని గుర్తు చేశారు. ఈ పర్యటనలో మేయర్​తో పాటు మున్సిపల్​ ఇంజినీర్​ ఆనంద్​ సాగర్​, డీఈ రషీద్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కరోనా వ్యాక్సిన్​ కోసం మళ్లీ ప్లాస్మా దానం

ABOUT THE AUTHOR

...view details