తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ మేయర్​ నీతూ కిరణ్​ నగర పర్యటన - నిజామాబాద్​ మేయర్ నీతూ కిరణ్

నిజామాబాద్​ మేయర్​ నీతూ కిరణ్​ నగరంలో పర్యటించారు. జిల్లా ప్రజానికానికి తాగునీరు సరఫరా చేసే ఖిల్లా ఫిల్టర్​ బెడ్, అలీసాగర్​ ఫిల్టర్​ బెడ్లను పరిశీలించారు. నగర అవసరాలకు సరిపడా నీటి లభ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసని పూర్తయ్యే వరకు నీటి ఎద్దడి రాకుండా చూడాలని.. అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Nizamabad Mayor Tour In Town
నిజామాబాద్​ మేయర్​ నీతూ కిరణ్​ నగర పర్యటన

By

Published : May 14, 2020, 11:36 PM IST

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో నగర మేయర్​ పర్యటించారు. నిజామాబాద్​ మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీరు అందించే ఖిల్లా ఫిల్టర్, అలీ సాగర్​ ఫిల్టర్​ బెడ్లను సందర్శించి పరిశీలించారు. అధికారులు, ఇంజినీర్ల సాయంతో నీటిని శుద్ధి చేసే విధానాన్ని తెలుసుకున్నారు.

వేసవి పూర్తయ్యే వరకు ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. నగరంలో నీటి సరఫరా, నీటి లభ్యత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్​ నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:రెండోరోజు 'ఉద్దీపన'లపై కోటి ఆశలు!

ABOUT THE AUTHOR

...view details