నిజామాబాద్ నగరంలో మట్టి రోడ్లు కనిపించకుండా సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. రహదారుల పైకి మురుగు నీరు ప్రవహించకుండా.. డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని 8 డివిజన్లలో రూ.80 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
హరిత నిజామాబాద్ దిశగా కార్పొరేషన్ ప్రణాళిక - development works in nizamabad
నిజామాబాద్ నగరంలోని 8 డివిజన్ల పరిధిలో రూ.80 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మేయర్ నీతూ కిరణ్ భూమి పూజ చేశారు. నగరంలో రహదారిపైకి మురుగు నీరు రాకుండా.. ప్రతి గల్లీలో డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

హరిత నిజామాబాద్ దిశగా కార్పొరేషన్ ప్రణాళిక
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే గాక.. హరిత నిజామాబాద్ దిశగా.. మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని మేయర్ నీతు కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, స్థానిక కార్పొరేటర్లు బట్టు రాఘవేందర్, ఎంఏ ఖుద్దుస్, బబ్లూ ఖాన్, మాయవర్ సవిత, న్యమతబాద్ శివచరణ్, నిచ్చెన్గ్ లత, మాస్టర్ శంకర్, చిటికెల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.