నిజామాబాద్ నగరంలో కొనసాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పరిశీలించడానికి మేయర్ దండు నీతూ కిరణ్ నగరంలో పర్యటించారు. మున్సిపాలిటీలోని 8, 11, 38వ డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య పనుల ద్వారా నగరంలో మురికికాలువలు శుభ్రం చేయటం, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేయడం, మురికి కాలువలు లేని చోట తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వర్షపు నీరు ఎక్కువగా నిలిచే ఖాళీ స్థలాల్లో ఆయిల్ బాల్స్, దోమల నివారణ మందులు వేయాలని సిబ్బందికి మేయర్ సూచించారు.
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్ నీతూకిరణ్ - నిజామాబాద్ మున్సిపాలిటీ
నిజామాబాద్ నగరంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నగర మేయర్ దండు నీతూ కిరణ్ పర్యవేక్షించారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న పనులను పరిశీలించారు. మురుగు కాల్వల విషయంలో పలు సూచనలు చేశారు.
![పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్ నీతూకిరణ్ Nizamabad Mayor Neethu Kiran Tour In Municipality](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7484761-924-7484761-1591340618034.jpg)
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్ నీతూకిరణ్
పలు కాలనీల్లో పర్యటించిన మేయర్ కాలనీవాసుల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రజలు చెత్తను రోడ్లపై, మురికి కాలువలలో వేయకుండా మున్సిపల్ వాహనాల్లో వేయాలని సూచించారు. నిజామాబాద్‌ను చెత్త రహిత నగరంగా మార్చడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలిపారు.