తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ. 35 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు

నిజామాబాద్‌లోని పలు డివిజన్లలో సుమారు రూ. 35లక్షల నిధులతో అభివృద్ధి పనులకు నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ భూమిపూజ చేసి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా సహకారంతో నగరంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మేయర్‌ తెలిపారు.

రూ. 35 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రూ. 35 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

By

Published : Sep 18, 2020, 7:10 PM IST

నిజామాబాద్‌లోని పలు డివిజన్లలో సుమారు రూ. 35లక్షల నిధులతో అభివృద్ధి పనులకు నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ భూమిపూజ చేసి ప్రారంభించారు. అభివృద్ధిలో భాగంగా నగరంలోని 42 వ డివిజన్‌లో ఓపెన్ జిమ్, సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. వసంత నగర్‌లో సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా సహకారంతో నగరంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మేయర్‌ తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా అభివృద్ధి ఎక్కడ ఆగకుండా ఉండే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాని పనులను పూర్తి చేసేలా కృషి చేస్తున్నామన్నారు. స్థానికులు వారి సమస్యలు ప్రస్తావించగా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు.

ఇదీ చదవండి:నిజామాబాద్ మేయర్​గా బాధ్యతలు స్వీకరించిన నీతూ కిరణ్

ABOUT THE AUTHOR

...view details