సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ సూచించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా నగరంలోని మారుతీనగర్‌లో మేయర్ పర్యటించారు. కాలనీలోని నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్బాల్స్ను వేశారు.
అనవసరపు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి : నీతూ కిరణ్ - నిజామాబాద్ మేయర్ పట్టణ పర్యటన
ప్రజలు తమ నివాస పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా నగరంలోని మారుతీనగర్‌లో మేయర్ పర్యటించారు. కాలనీలోని నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్బాల్స్ను వేశారు.
![అనవసరపు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి : నీతూ కిరణ్ Nizamabad Mayor visiting town](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7711918-268-7711918-1592741730539.jpg)
Nizamabad Mayor visiting town
వర్షాకాలం ప్రారంభమైనందున ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు రావని తెలిపారు. మేయర్ వెంట మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, కార్పొరేటర్లు విక్రమ్ గౌడ్, సాయివర్ధన్, బట్టు రాఘవేందర్, ధర్మపురి మల్లేశ్, అరుణ్, యమున, అనిల్ తదితరులున్నారు.