నిజామాబాద్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నగర మేయర్ నీతూ కిరణ్ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత విషయంలో బాధ్యతగా ఉండాలని కోరారు.
సీజల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి - Nizamabad Mayor Dandu Kiran
మరికొన్ని రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతుండడం వల్ల సీజనల్ వ్యాధులు అధికంగా వచ్చే ఆస్కారం ఉండటంతో అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా నిజామాబాద్లో ప్రజలకు మేయర్ అవగాహన కల్పించారు.
సీజల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఇంటి పరిసర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.