కరోనా ఎఫెక్ట్: ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా - స్థానిక సంస్థల పోలింగ్
Nizamabad Local body MLC elections Postpone
16:13 March 24
కరోనా ఎఫెక్ట్: ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ వాయిదా పడింది. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
భూపతిరెడ్డి అనర్హతా వేటుతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు గతంలోనే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణల గడువు ముగిసింది. ఏప్రిల్ ఏడో తేదీన జరగాల్సిన పోలింగ్‌ను వాయిదా వేసింది.
Last Updated : Mar 24, 2020, 7:01 PM IST