తెలంగాణ

telangana

ETV Bharat / state

పని భారాన్ని తగ్గించాలని ధర్నా చేపట్టిన ఆసుపత్రి సిబ్బంది - telangana news

కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో శానిటేషన్, పేషంట్ కేర్, భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ధర్నా నిర్వహించారు. పని భారాన్ని తగ్గించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Dharna under the auspices of AITUC
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా

By

Published : Apr 11, 2021, 8:55 AM IST

కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ మాస్కులు, శానిటైజర్, సబ్బులు ఇవ్వటం లేదని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచి... పని భారాన్ని తగ్గించాని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు.

ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల, బోధన్ జిల్లా ఆస్పత్రులలో పని చేస్తున్న సిబ్బంది పట్ల అధికారులు, కాంట్రాక్టర్‌లు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాపోయారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో యూనియన్ అధ్యక్షుడు సుధాకర్, ప్రధాన కార్యదర్శి హైమది భేగం, కార్మికులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:డెవలప్‌మెంట్‌ ఛార్జీలతో విద్యుత్ శాఖ అదనపు వడ్డింపు

ABOUT THE AUTHOR

...view details