తెలంగాణ

telangana

ETV Bharat / state

'మా భూముల పట్టాలు మాకివ్వండి' - nizamabad formers protest demanding thier passbook for thier lands

దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు వక్ఫ్​ భూములని చెప్పి తమకు పట్టాలివ్వకుండా నిలిపివేశారని నిజామాబాద్​ జిల్లా కందకుర్తి రైతులు ఆందోళనకు దిగారు. భాజపా నేతలు యెండల లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు రైతుల ఆందోళనకు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు.

'మా భూముల పట్టాలు మాకివ్వండి'

By

Published : Aug 26, 2019, 3:36 PM IST

'మా భూముల పట్టాలు మాకివ్వండి'

పట్టా పాసు పుస్తకాల కోసం నిజామాబాద్​ జిల్లా రెంజల్​ మండలం కందకుర్తి రైతులు ఆందోళన బాట పట్టారు. కలెక్టరేట్ ఎదుట రైతులు బైఠాయించి ధర్నా చేశారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు వక్ఫ్ భూములని చెప్పి తమకు పట్టాలివ్వకుండా నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. భాజపా నేతలు యెండల లక్ష్మీనారాయణ, ఇతర నాయకులు రైతుల ఆందోళనకు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. వెంటనే రైతులకు పట్టాలిచ్చి సమస్యను పరిష్కరించాలని యెండల డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details