తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద బారులు తీరిన రైతులు - FORMERS

పసుపు, ఎర్రజొన్న పండించేవాళ్లతో చెరకు రైతులూ కలిశారు. మద్దతు ధర కోసం పోరాటం చేస్తున్న కర్షకులు..లోక్ సభ పోరుకు సిద్ధమయ్యారు. ఇవాళ చివరిరోజు అయినందున భారీగా నామపత్రాలతో నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్​ వద్ద బారులు తీరారు.

నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద బారులు తీరిన రైతులు

By

Published : Mar 25, 2019, 11:39 AM IST

Updated : Mar 25, 2019, 12:57 PM IST

నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద బారులు తీరిన రైతులు
లోక్​సభ నియోజకవర్గాలకు నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. నిజామాబాద్​ కలెక్టరేట్​ వద్ద నామపత్రాలు దాఖలు చేసేందుకు రైతులు బారులు తీరారు. పసుపు, ఎర్రజొన్న, చెరకు కర్షకులు నామినేషన్​ వేసేందుకు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగియనుంది. ఇప్పటివరకు 50 మంది నామపత్రాలు దాఖలు చేశారు. పంటకు మద్దతు కల్పించాలనే డిమాండ్​తో రైతులు పార్లమెంటు స్థానానికి పోటీకి దిగారు. ఇవాళ చెరకు రైతులు కూడా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. రేంజల్ మండలం నుంచి భారీగా నామపత్రాలతో తరలివచ్చారు.

భారీ బందోబస్తు:​

వీరందరి రాకతో కలెక్టరేట్ ప్రాంగణం నిండిపోయింది. పోలీసులు ముందుజాగ్రత్తగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. కలెక్టరేట్ వద్ద 144 సెక్షన్ విధించారు.

ఇదీ చూడండి:నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు

Last Updated : Mar 25, 2019, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details