ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి ఎన్నికల బరిలోకి దిగిన నిజామాబాద్ పసుపు రైతుల నామినేషన్ల తిరస్కరణపై సీఈసీకి ఫిర్యాదు చేయాలని కర్షకులు నిర్ణయం తీసుకున్నారు. రిటర్నింగ్ అధికారులు పసుపు రైతుల నామినేషన్లను తిరస్కరించడంతో... ప్రస్తుతం పసుపు రైతులు దిల్లీ చేరుకున్నారు. అనతరం వారణాశి ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై ఫిర్యాదు చేయనున్నారు. గత నెల 29న 50 మందికి పైగా వారణాసి వెళ్లి... 25 మంది నామ పత్రాలు దాఖలు చేశారు.
సీఈసీకి ఫిర్యాదు చేయనున్న పసుపు రైతులు - NIIZAMABAD
పసుపు బోర్డు లక్ష్యంగా ప్రధాని మోదీకీ పోటీగా నామపత్రాలు దాఖలు చేసిన నిజామాబాద్ పసుపు రైతుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ విషయంపై సీఈకి ఫిర్యాదు చేసేందుకు కర్షకులు దిల్లీకి వెళ్లారు.
సీఈసీకి ఫిర్యాదు చేయనున్న పసుపు రైతులు