నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఈ సభలో నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పాల్గొన్నారు. కరోనా కారణంగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ...రాజీవ్ గాంధీ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం: మధుయాష్కీ గౌడ్ - ప్రభుత్వాలపై నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమర్శలు
కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం - మధుయాష్కీ గౌడ్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాని కట్టడి చేయడంలో విఫలమయ్యారని మధుయాష్కీ విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కంటే ఆరోగ్య శ్రీ ఎంతో మెలైందన్నారు.
ఇదీ చదవండి:గాంధీలో కరోనా రోగులకు బలవర్ధక ఆహారం