నిజామాబాద్ జిల్లాలోని ప్రాథమిక సహకార సంఘాల కేంద్రాల్లో పచ్చిరొట్ట(జీలుగు) విత్తనాల పంపిణీ ఆందోళనకరంగా మారింది. డిచ్పల్లి మండల పరిధిలోని భక్తిపూర్ సహాయ సహకార కార్యాలయం వద్ద కేవలం 350 బస్తాల జీలుగు విత్తనాలు రావడంతో రైతులు ఆందోళన చేశారు. డిమాండ్‌కు సరిపడా విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆత్రుతతో జీలుగు విత్తనాల కోసం పంపిణీ కేంద్రాలకు ఎగబడ్డారు.
పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతుల ఆందోళన - పచ్చిరొట్ట విత్తనాల కోసం నిజామాబాద్ రైతుల ఆందోళన
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల పరిధిలోని భక్తిపూర్ సహాయ సహకార కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేశారు. డిమాండ్‌కు సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు అందించాలని కోరారు.

పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతుల ఆందోళన
జనాలు ఎక్కువగా రావడం వల్ల వ్యవసాయశాఖ అధికారులకు కొవిడ్ భయం పట్టుకుంది. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా విత్తనాల కోసం రైతులు గుమికూడుతున్నారని వాపోతున్నారు.
ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో