ఇందూరు జిల్లాలో డివిజన్ల వారీగా క్షేత్ర వాస్తవాలు ఒక్కో రకంగా ఉన్నాయి. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్‌లో గరిష్ఠంగా క్వింటా ధాన్యానికి రెండు కిలోల చొప్పున కడ్తా విధిస్తుండగా... బోధన్ డివిజన్లో దర్జాగా ఐదు కిలోల తరుగు తీసుకొంటున్నారు. ఇదేమంటే తాము ఇంతే అనే సమాధానం ఇస్తున్నారు.
కడ్తాకోత... మిల్లర్లమేత - nizamabad rice millers kadtha cutting highly
ఎటొచ్చి రైతు శ్రమే దోపిడీకి గురవుతోంది. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కడ్తా కోత పేరుతో కిలో నుంచి 5 కిలోల తరుగు తీసుకుంటున్నారు.
nizamabad district latest news
కడ్తా విలువ రూ. 16.88 కోట్లు...
- జిల్లాలో 354 కొనుగోలు కేంద్రాలకు గాను ప్రస్తుతం 318 కేంద్రాల్లో కాంటాలు నడుస్తున్నాయి. మొత్తం 70 బియ్యం మిల్లులకు ధాన్యం సరఫరా అవుతోంది. బోధన్ డివిజన్‌లో 14 మిల్లులు ఉన్నాయి.
- యాసంగిలో 9.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని అధికార యంత్రాంగం అంచనా వేసింది. ఈ లెక్కన బోధన్ డివిజన్‌లో 18.40 లక్షల క్వింటాళ్లకు సమానమైన 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అవకాశం ఉంది.
- క్వింటాకు ఐదు కిలోల తరుగు కింద సుమారు 92 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని ఉచితంగా తీసుకొంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.1,835 ఉంది. ఈ లెక్కన మిల్లర్లు సేకరిస్తున్న కడ్తా విలువ రూ. 16.88 కోట్లు.
కడ్తా పేరుతో రైతులను మోసం చేస్తే బియ్యం మిల్లులపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. అలాగే కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా యంత్రాంగం పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.