నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని పంట పొలాలను పొగమంచు దుప్పటి కప్పేసింది. దట్టమైన పొగమంచుతో రహదారులు కనపడక వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
దట్టమైన పొగమంచుతో వాహనదారుల ఇక్కట్లు
నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో తెల్లవారుజాము పొగమంచు కురిసింది. దట్టమైన పొగమంచుతో దుప్పటి కప్పుకున్న రహదారులపై ప్రయాణించడానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
దట్టమైన పొగమంచుతో వాహనదారుల ఇబ్బందులు.
వరి పంటలు కోత దశకు చేరుకున్న తరుణంలో.. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ చాలాచోట్ల కోతలు ప్రారంభం కాగా వాతావరణ శాఖ హెచ్చరికలతో.. పంట చేతికొస్తుందో రాదోనని రైతుల గుండెలు గుబేలుమంటున్నాయి. వరి కోతలు పూర్తై ధాన్యం అమ్ముడుపోయే వరకు వానలు కురవకూడదని దేవుణ్ని వేడుకుంటున్నారు.