తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సుయాత్రకు సిద్ధమైన పసుపు, ఎర్రజొన్న రైతులు

లోక్ సభ బరిలో నిలిచిన పసుపు, ఎర్రజొన్న రైతులు భవిష్యత్ కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఆర్మూరులో సమావేశమైన కర్షకులు.. త్వరలో పోటీలో ఉన్న వారిలో ఒకరిని తమ నాయకునిగా ఎన్నుకోవాలని తీర్మానించారు.

పసుపు, ఎర్రజొన్న రైతులు

By

Published : Mar 30, 2019, 6:22 PM IST

రైతును గెలిపించాలని నిజామాబాద్​ కర్షకుల వినతి
నిజామాబాద్​ లోక్​సభ ఎన్నికల బరిలో ఉన్న పసుపు, ఎర్రజొన్న రైతులు ఆర్మూర్​లో సమావేశమయ్యారు. తమ భవిష్యత్​ కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అన్ని గ్రామాల్లో బస్సు యాత్ర చేపట్టాలని,బూత్​ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్​ 8 లేదా 9న ఆర్మూరులో బహిరంగ సభ నిర్వహించి పోటీలో ఉన్న వారిలో ఒకరిని తమ నేతగా ఎన్నుకొని అతనికే ఓటెయ్యాలని అభ్యర్థించనున్నారు.

రైతునుగెలిపించండి

పార్లమెంటులో రైతులకు రిజర్వేషన్లు కల్పించాలని కర్షకులుడిమాండ్​ చేశారు. రైతును విస్మరిస్తే రాజకీయ పార్టీలకు ఎలాంటి గతి పడుతుందో తెలియచెప్పాలని రైతు నాయకుడు అన్వేష్​రెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రజలు తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అన్నదాతను గెలిపించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :'పట్టాదారు పాసు పుస్తకాలిస్తేనే... ఓట్లేస్తాం'

ABOUT THE AUTHOR

...view details