దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఫలితం వెల్లడికి సమయం ఆసన్నమైంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను యంత్రాంగం పూర్తి చేసింది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉండగా... ఇందూరు జిల్లాలో నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో ఐదు నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతుంది. జగిత్యాలలో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల కౌంటింగ్ చేపడుతారు.
అత్యధికంగా 36 టేబుళ్లు
నిజామాబాద్ లోక్సభ కౌంటింగ్ కోసం అత్యధికంగా 36 టేబుళ్లకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఒక్కో అసెంబ్లీకి రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఏడు అసెంబ్లీలకు మొత్తం 14 హాళ్లలో లెక్కింపు జరగనుంది. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, కోరుట్ల, జగిత్యాలలో 8 రౌండ్లు, బోధన్, బాల్కొండ నియోజకవర్గాలు 7 రౌండ్లు, ఆర్మూర్ నియోజకవర్గం 6 రౌండ్లలో లెక్కించనున్నారు. ఈవీఎంల కౌంటింగ్ పూర్తైన తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున వీవీప్యాట్లను లెక్కిస్తారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు ఐదు రౌండ్ల సమయం పట్టే అవకాశం ఉంది. కౌంటింగ్ కోసం దాదాపు వెయ్యి మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.
పటిష్ఠ బందోబస్తు