అల్లోపతి వైద్య విధానంలో శస్త్రచికిత్స చేసేలా ఆయుర్వేద వైద్యులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా వైద్యులు నిరసన తెలిపారు. ఈ మేరకు భారత వైద్యుల సంఘం(ఐఎంఏ)జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
'అలోపతి వైద్యంలో ఆయుర్వేద వైద్యులకు పరిజ్ఞానం లేదు' - కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిజామాబాద్ వైద్యుల నిరసన
అలోపతి వైద్య విధానంలో శస్త్ర చికిత్స చేయడానికి ఆయుర్వేద వైద్యులకు కేంద్రం అనుమతినివ్వడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా వైద్యులు ఆందోళన బాట పట్టారు. ఏ మాత్రం అనుభవం లేని వారికి అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
!['అలోపతి వైద్యంలో ఆయుర్వేద వైద్యులకు పరిజ్ఞానం లేదు' nizamabad doctors protests against ayurveda doctors are permitted for allopathy surgery treatment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9842212-366-9842212-1607685505240.jpg)
'అలోపతి వైద్యంలో ఆయుర్వేద వైద్యులకు పరిజ్ఞానం లేదు'
ఆయుర్వేద వైద్యులకు అల్లోపతిలో కనీస పరిజ్ఞానం లేదని ఐఎంఏ జిల్లా కార్యదర్శి డా. విశాల్ పేర్కొన్నారు. అనుభవం, అవగాహన లేకపోయినా శస్త్రచికిత్సలు చేయడానికి వారికి అనుమతి ఇవ్వడం అన్యాయమని.. ఇది ప్రజల ప్రాణాలను తీయడమేనని విమర్శించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ప్రజల ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి: మంత్రి శ్రీనివాస్ గౌడ్