తెలంగాణ

telangana

ETV Bharat / state

' ప్రజాసేవకు అంకితమైన వారికి ఇందూరు వందనం'

కరోనా వైరస్​ కట్టడికి రాష్ట్ర ప్రజలంతా పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా ప్రజలు జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. కొవిడ్-19 సోకకుండా చర్యలు చేపడుతున్న పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి, వైరస్​ సోకిన వారికి చికిత్స అందిస్తోన్న వైద్యులకు చప్పట్లతో సంఘీభావం తెలిపారు.

nizamabad district people clapped for unsung heroes who are serving corona patients
' ప్రజాసేవకు అంకితమైన వారికి ఇందూరు వందనం'

By

Published : Mar 23, 2020, 10:48 AM IST

కరోనా వైరస్​ విజృంభిస్తోన్న నేటి క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేస్తోన్న వారికి ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా వాసులు, జిల్లా కలెక్టర్ దంపతులు చప్పట్లతో మద్దతు తెలిపారు. తమ ప్రాణాలు లెక్కచేయకుండా ప్రజలకు నిరంతరం సేవలందిస్తోన్న పోలీసులు, వైద్య సిబ్బంది, రెవెన్యూ అధికారులకు ప్రజలు చప్పట్లతో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.

కొవిడ్-19 వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లా ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వైరస్​ సోకకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రజలు స్వచ్ఛంద బంద్ పాటించడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేశారు. వైరస్ కట్టడికి ఐక్యత చాటుతున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

' ప్రజాసేవకు అంకితమైన వారికి ఇందూరు వందనం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details