'ప్రాథమిక దశలో గుర్తిస్తే.. బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకోవచ్చు' - black fungus cases in telangana
బ్లాక్ ఫంగస్ ప్రభావం మొదట ముక్కుపై ఉంటుందని.. అక్కణ్నుంచి క్రమంగా కంటికి వ్యాపిస్తుందని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుజాత తెలిపారు. కళ్లలోంచి నీరు కారడం, నొప్పి రావడం దీని ప్రథమ లక్షణాలని చెప్పారు.
డాక్టర్ సుజాత, బ్లాక్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ లక్షణాలు
ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా బ్లాక్ ఫంగస్ నుంచి కోలుకునే అవకాశం ఉందని కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుజాత తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నిర్లక్ష్యం తగదని సూచించారు. కంటి సంబంధ సమస్యలుంటే తక్షణమే వైద్యులని సంప్రదించాలన్నారు. వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్లే ఇది వస్తుందని చెప్పారు. కరోనా బారిన పడిన వారందరికీ రాదని స్పష్టం చేశారు. బ్లాక్‌ఫంగస్‌ను తొలిదశలోనే గుర్తించి జాగ్రత్త పడాలంటున్న డాక్టర్ సుజాతతో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి...
- ఇదీ చదవండి :'వైరస్‌ను జయించిన తర్వాత మరింత అప్రమత్తత అవసరం'