నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల సర్వ సభ్య సమావేశం రసాభాసగా సాగింది. గతంలో జరిగిన సమావేశంలో గడ్డి కోసే యంత్రాలను ఎంపీటీసీకి ఒకటి చొప్పున మంజూరు చేయాలని తీర్మానించారు. దానిని కలెక్టర్ ఆమోదం కోసం పంపారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలో ఆ తీర్మానాన్ని తిరస్కరించామనీ, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించమని తీర్మానించారు.
రసాభాసగా సర్వ సభ్య సమావేశం.. ఎంపీటీసీల నిరసన - నిజామాబాద్ జిల్లా తాజా వార్తలు
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో సర్వ సభ్య సమావేశం రసాభాసగా సాగింది. గతంలో.. గడ్డి కోసే యంత్రాలను ఎంపీటీసీకి ఒకటి చొప్పున మంజూరు చేయాలని తీర్మానించగా.. ఇప్పుడు వందల సంఖ్యలో రైతుల నుంచి దరఖాస్తులు రావడంతో ఎంపీటీసీలు నిరసన వ్యక్తం చేశారు.

రసాభాసగా సర్వ సభ్య సమావేశం.. ఎంపీటీసీల నిరసన
ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మండల సర్వ సభ్య సమావేశంలో ఎంపీటీసీలు నిరసన తెలిపి, సమావేశాన్ని బహిష్కరించారు. మొత్తం 17 యూనిట్లు మండలానికి మంజూరైతే దరఖాస్తులు మాత్రం వందల సంఖ్యలో వచ్చాయనీ, ఎంత మందికి మంజూరు చేస్తారో వారు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.