నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి నగరంలోని బస్టాండ్‌ను తనిఖీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సిబ్బంది తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తల గురించి ఆరా తీశారు. ప్రయాణికులతో మాట్లాడి జాగ్రత్తలు చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించాలని సూచించారు.
విదేశాల నుంచి వచ్చిన వారిని జిల్లాలోని ఐసోలేషన్ సెంటర్లో ఉంచుతున్నట్లు నారాయణరెడ్డి తెలిపారు. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు వచ్చిన 964 మందిలో ఆరుగురు అనుమానితులుండగా.. క్వారంటైన్ చేసి ఒకరిని గాంధీకి తరలించినట్లు వెల్లడించారు.