ఎస్సారెస్పీని సందర్శించిన నిజామాబాద్ కలెక్టర్ - నిజామాబాద్ జిల్లాలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు సందర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ప్రాజెక్టు వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు సందర్శన
నిజామాబాద్ జిల్లా మెండోరాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కలెక్టర్ రామ్మోహన్రావు సందర్శించారు. నీటి ప్రవాహాన్ని పరిశీలించి, నీటి మట్టం, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సందర్శనకు వచ్చే పర్యాటకులు ప్రాజెక్టు వద్ద జాగ్రత్తగా ఉండాలని, తిరిగి ఇళ్లకు క్షేమంగా వెళ్లాలని సూచించారు. ప్రాజెక్టు పైనకు వెళ్లడానికి ఎవరికి అనుమతి లేదని, అధికారులకు సహకరించాలని కోరారు.
- ఇదీ చూడండి : మరిగే నూనెలో మురిగిన ముక్కలేసి...