నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. దవాఖానాలోని అన్ని విభాగాలను పరిశీలించారు. కరోనా నిర్ధరణ పరీక్షలకు అవసరమైన కిట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి - bodha govt hospital latest news
కరోనా నిర్ధరణ పరీక్షలకు అవసరమైన కిట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్నాయని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలోని బోధన్ ప్రభుత్వం ఆస్పత్రిని తనిఖీ చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి
ప్రైవేట్ దవాఖానాకు కొవిడ్ పరీక్షల కోసం వచ్చిన వారికి సీటీ స్కాన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా సోకితే భయపడకుండా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయన్నారు.