'గాంధీ ఆశయ సాధనకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోంది' - nizamabad district collector narayanareddy
మహాత్మా గాంధీ ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. నగరంలోని గాంధీ చౌక్‌లో మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
!['గాంధీ ఆశయ సాధనకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోంది' Nizamabad district collector narayana reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9022996-78-9022996-1601635909194.jpg)
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
నిజామాబాద్ నగరంలో గాంధీ జయంతి 151వ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్‌లో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి.. మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి యువత గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నగర కమిషనర్ జితేశ్ పాల్గొన్నారు.