తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ ఏడాది పిడిగుద్దులాటకు బ్రేక్..! - Bodhan zone Hunsa village

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో ప్రతి ఏటా ఆడే పిడిగుద్దులాటకు బ్రేక్ పడింది. కొవిడ్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోధన్ ఏసీపీ ఎన్.రామారావు తెలిపారు.

nizamabad latest news
గ్రామస్థులతో సమావేశం

By

Published : Mar 27, 2021, 7:33 PM IST

ప్రతి ఏడాది నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో నిర్వహించే పిడిగుద్దులాటకు బ్రేక్ పడింది. కరోనా తీవ్రత దృష్ట్యా.. బోధన్ రూరల్ పోలీసులు ఈ విషయమై గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. భేటీలో ఈ సంవత్సరం పోటీలను నిర్వహించొద్దని నిర్ణయం తీసుకున్నట్లు ఏసీపీ ఎన్.రామారావు తెలిపారు.

పిడిగుద్దులాట...?

133 సంవత్సరాల నుంచి పిడిగుద్దులాట అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం హోలీ రోజు హున్సా గ్రామంలో రంగులు, కుస్తీల పోటీలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామ చావిడి దగ్గర గ్రామస్థులంతా రెండువర్గాలుగా విడిపోయి ఒకరినొకరు పిడిగుద్దులతో కొట్టుకుంటారు. ఈ ఆట ఆడకుంటే అరిష్టం జరుగుతుందని.. అందుకే కొనసాగిస్తున్నామని వారు తెలిపారు.

ఇదీ చదవండి:ఆర్డరివ్వండి... పోస్టులో ప్రసాదం మీ ఇంటికొస్తుంది..

ABOUT THE AUTHOR

...view details