తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వ్యాప్తి నియంత్రణకు పటిష్ఠ చర్యలు: బోధన్​ ఆర్డీఓ - nizamabad district bodhan rdo introduce new plan for reduce coronavirus

రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతోన్న తరుణంలో బోధన్​ అధికారులు అప్రమత్తమయ్యారు. సిబ్బందిని కమిటీలుగా ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా ఉంచాలని అధికారులకు బోధన్​ ఆర్​డీఓ ఆదేశించారు.

nizamabad district bodhan rdo introduce new committee for reduce corona virus
కరోనా వ్యాప్తి నియంత్రణకు పటిష్ఠ చర్యలు: బోధన్​ ఆర్డీఓ

By

Published : Mar 21, 2020, 3:54 PM IST

కరోనా వ్యాధిని అరికట్టడానికి నిజామాబాద్ జిల్లా బోధన్ అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. వార్డుల వారీగా ఆశ వర్కర్లు, మెప్మా సిబ్బందితో కమిటీ ఏర్పాటు చేసి విదేశాల నుంచి వచ్చే వారిని పరిశీలనలో ఉంచాలని ఆర్​డీఓ గోపి రామ్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి చేతిపై స్టాంప్ వేసి వారు వచ్చిన తేదీ నుంచి 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని, వారిపై నిరంతరం నిఘా ఉంచాలని సిబ్బందికి ఆర్డీఓ దిశానిర్దేశం చేశారు

కమిటీ సభ్యులే కాకుండా వాళ్లు ఇంటి చుట్టుపక్కల వారికి భాగస్వామ్యం కల్పించి కరోనా వ్యాధిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే ఎంతటివారైనా... చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కరోనా వ్యాప్తి నియంత్రణకు పటిష్ఠ చర్యలు: బోధన్​ ఆర్డీఓ

ఇదీ చూడండి:చైనాలో మూడో రోజూ కరోనా కేసులు సున్నా

ABOUT THE AUTHOR

...view details